Share News

TTD Cancels Offline Shrivani Ticket Booking: తిరుమలలో ‘శ్రీవాణి’ ఆఫ్‌లైన్‌ టికెట్ల జారీ రద్దు

ABN , Publish Date - Jan 09 , 2026 | 05:42 AM

నేటి నుంచి తిరుమలలో కౌంటర్‌ ద్వారా శ్రీవాణి టికెట్ల విక్రయం ఉండదు. ఆఫ్‌లైన్‌ ద్వారా రోజువారి టికెట్ల జారీ విధానాన్ని టీటీడీ రద్దు చేసింది.

TTD Cancels Offline Shrivani Ticket Booking: తిరుమలలో ‘శ్రీవాణి’ ఆఫ్‌లైన్‌ టికెట్ల జారీ రద్దు

తిరుమల, జనవరి 8(ఆంధ్రజ్యోతి): నేటి నుంచి తిరుమలలో కౌంటర్‌ ద్వారా శ్రీవాణి టికెట్ల విక్రయం ఉండదు. ఆఫ్‌లైన్‌ ద్వారా రోజువారి టికెట్ల జారీ విధానాన్ని టీటీడీ రద్దు చేసింది. ఈ పద్ధతిలో ప్రస్తుతం రోజుకు 800 టికెట్లు జారీ చేస్తున్నారు. శుక్రవారం నుంచి ఆన్‌లైన్‌లోనే ఏరోజుకా రోజు వీటిని విడుదల చేస్తారు. ఈ టిక్కెటను ప్రతి రోజు ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేసి మధ్యాహ్నం 2 గంటల వరకు అందుబాటులో ఉంచుతారు. టికెట్‌ పొందిన భక్తులు అదే రోజు సాయంత్రం 4 గంటలకు దర్శనానికి వెళ్లవచ్చు. ఒక కుటుంబంలో నలుగురు సభ్యులకు మాత్రమే అనుమతి ఉంటుంది. కాగా ప్రస్తుతం అమలులోనున్న శ్రీవాణి దర్శన టిక్కెట్ల అడ్వాన్సు బుకింగ్‌, తిరుపతి విమానాశ్రయంలో ఆఫ్‌లైన్‌ కరెంటు బుకింగ్‌ విధానం మాత్రం యథాతధంగా కొనసాగుతుంది.

Updated Date - Jan 09 , 2026 | 05:42 AM