Share News

మండలి సాక్షిగా వైసీపీ దైవద్రోహం: భానుప్రకాశ్‌రెడ్డి

ABN , Publish Date - Feb 22 , 2026 | 04:59 AM

కలియుగ ప్రత్యక్ష దైవంగా కోట్లాది భక్తులు కొలిచే శ్రీ వేంకటేశ్వర స్వామి పట్ల వైసీపీ ఎమ్మెల్సీలు రాష్ట్ర శాసనమండలి సాక్షిగా దైవ ద్రోహనికి పాల్పడ్డారని టీటీడీ బోర్డు...

మండలి సాక్షిగా వైసీపీ దైవద్రోహం: భానుప్రకాశ్‌రెడ్డి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): కలియుగ ప్రత్యక్ష దైవంగా కోట్లాది భక్తులు కొలిచే శ్రీ వేంకటేశ్వర స్వామి పట్ల వైసీపీ ఎమ్మెల్సీలు రాష్ట్ర శాసనమండలి సాక్షిగా దైవ ద్రోహనికి పాల్పడ్డారని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఏపీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్‌రెడ్డి మాట్లాడారు. ‘చెప్పులు ధరించి వైసీపీ ఎమ్మెల్సీలు, వెంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని ప్రదర్శించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూవుల మనోభావాలు దెబ్బతిన్నాయి. స్వామి వారి పట్ల అపచారానికి పాల్పడిన వైసీపీ ఎమ్మెల్సీల తరఫున ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఇది ముందస్తు ప్రణాళికతో హిందూ భావోద్వేగాలను రెచ్చగొట్టేందుకు చేసిన కుట్రపూరిత చర్య. అపచారం చేసిన వారందరికీ లీగల్‌ నోటీసులు పంపిస్తాం’ అని చెప్పారు.

Updated Date - Feb 22 , 2026 | 04:59 AM