Share News

నవీ ముంబయి శ్రీనివాసుడికి రూ.4.9 కోట్లతో బంగారు కవచం

ABN , Publish Date - Mar 15 , 2026 | 04:18 AM

దేశ ఆర్థిక రాజధాని నవీ ముంబయిలోని శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలోని మూలవిరాట్టుతో పాటు ఉప ఆలయాల విగ్రహాల కవచాల రాగి రేకులపై బంగారు తాపడాన్ని వేసేందుకు టీటీడీ నిర్ణయించింది.

నవీ ముంబయి శ్రీనివాసుడికి రూ.4.9 కోట్లతో బంగారు కవచం

తిరుపతి(టీటీడీ), మార్చి 14(ఆంధ్రజ్యోతి): దేశ ఆర్థిక రాజధాని నవీ ముంబయిలోని శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలోని మూలవిరాట్టుతో పాటు ఉప ఆలయాల విగ్రహాల కవచాల రాగి రేకులపై బంగారు తాపడాన్ని వేసేందుకు టీటీడీ నిర్ణయించింది. బంగారం, రాగి రేకులకు సుమారు రూ.4.90 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. కార్మికులు పనిచేసినందుకు రూ.22 లక్షలతో పాటు మొత్తంగా రూ.5.12 కోట్ల వ్యయంతో రాగిరేకులపై బంగారు తాపడాన్ని వేసేందుకు ఇటీవల టీటీడీ పాలకమండలి ఆమోదం తెలిపింది.

Updated Date - Mar 15 , 2026 | 04:18 AM