రూ.5,400 కోట్లతో టీటీడీ వార్షిక బడ్జెట్!
ABN , Publish Date - Feb 28 , 2026 | 05:13 AM
టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం శనివారం తిరుమలలో జరుగనుంది. చైర్మన్ బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో సభ్యులు, ఉన్నతాధికారులు...
నేటి ధర్మకర్తల మండలి సమావేశంలో ఆమోదం
తిరుమల, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం శనివారం తిరుమలలో జరుగనుంది. చైర్మన్ బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో సభ్యులు, ఉన్నతాధికారులు అన్నమయ్య భవనంలో జరిగే ఈ సమావేశంలో పాల్గొననున్నారు. దాదాపు 87 అంశాలతో తయారుచేసిన అజెండా అంశాలపై చర్చ జరుగనుంది. ప్రధానంగా 2006-27 వార్షిక బడ్జెట్ దాదాపు రూ.5,400 కోట్లతో ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది. అలాగే హుండీలో నగదు రహిత కానుకల సమర్పణ కోసం ‘శ్రీవారి ముడుపు పత్రం’ విధానంపై చర్చ జరిపి తీర్మానం చేయనున్నారు. గతంలో బోర్డు తీసుకున్న నిర్ణయాలు, వాటి పురోగతిపై కూడా సభ్యులు చర్చిస్తారు.