Share News

సామాన్యులకూ శ్రీవారి అభిషేక సేవ దర్శనం

ABN , Publish Date - May 23 , 2026 | 06:00 AM

శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన భక్తులకు శుక్రవారం అరుదైన అవకాశం లభించింది. 5,850 మంది సామాన్య భక్తులు అభిషేక సేవలో స్వామివారిని దర్శించుకున్నారు.

సామాన్యులకూ శ్రీవారి అభిషేక సేవ దర్శనం

  • రద్దీ నేపథ్యంలో అనుమతించిన టీటీడీ

ఇంటర్నెట్ డెస్క్: శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన భక్తులకు శుక్రవారం అరుదైన అవకాశం లభించింది. 5,850 మంది సామాన్య భక్తులు అభిషేక సేవలో స్వామివారిని దర్శించుకున్నారు. సాఽధారణంగా శ్రీవారికి జరిగే కైంకర్యాల్లో అత్యంత డిమాండు ఉన్న సేవ శుక్రవారం వేకువజామున జరిగే అభిషేకం. అడ్వాన్స్‌ బుకింగ్‌ ద్వారా 2040వ సంవత్సరం వరకు పూర్తిస్థాయిలో అన్ని టికెట్లు బుక్‌ కాగా, 2060 వరకు కొన్ని తేదీల్లో బుక్కయ్యాయి. దీంతో అభిషేక సేవలో స్వామిని చూడటమంటే సామాన్యుడికి పెద్ద వరమే. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం 4.30 నుంచి 6 గంటల మధ్య జరిగిన అభిషేక సేవలో 5,850 మంది భక్తులు అనుకోకుండా స్వామిని దర్శించుకుని ఆనందపరవశులయ్యారు. అభిషేక టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో దాదాపు 50 మంది ప్రముఖులతో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, అధికార బృందం ఫోన్లలో మాట్లాడి రద్దీ పరిస్థితిని వివరించారు. దీంతో చాలా మంది తమ సేవలను రద్దు చేసుకోవడంతో అభిషేకసేవ భక్తులు గర్భాలయానికే పరిమితమైన క్రమంలో సామాన్య భక్తులూ జయవిజయుల గడప నుంచి అభిషేకాన్ని చూసే భాగ్యం కలిగింది.

Updated Date - May 23 , 2026 | 06:00 AM