ట్రాలీ బోల్తా
ABN , Publish Date - Feb 18 , 2026 | 12:13 AM
మండలంలో వంజరి పంచాయతీ పరిధి ములక్కాయపుట్టు గ్రామ సమీపంలో మంగళవారం జాతీయ రహదారి నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది.
డ్రైవర్ సహాయకుడు మృతి
డ్రైవర్‌కు స్వల్ప గాయాలు
జాతీయ రహదారి పనులు చేస్తుండగా ఘటన
జి.మాడుగుల, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): మండలంలో వంజరి పంచాయతీ పరిధి ములక్కాయపుట్టు గ్రామ సమీపంలో మంగళవారం జాతీయ రహదారి నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. రహదారి పనులు చేస్తున్న ట్రాలీ అదుపుతప్పి బోల్తా పడడంతో డ్రైవర్ సహాయకుడు మృతి చెందగా, డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. దీనికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయు. జాతీయ రహదారి పనుల్లో ఒడిశాకు చెందిన తమల్ దయాల్ ట్రాలీ డ్రైవర్‌గా, బిహార్‌కు చెందిన సంతోశ్ శర్మ అతనికి సహాయకుడిగా పని చేస్తున్నారు. మంగళవారం పనులు చేస్తున్న క్రమంలో ట్రాలీ అదుపు తప్పడంతో ప్రమాదాన్ని గమనించిన సంతోశ్ శర్మ ముందుగా వాహనం నుంచి కిందకు దూకేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ సమయంలో బోల్తా పడిన ట్రాలీ వెనుక భాగం అతడిని బలంగా ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా డ్రైవర్ దయాల్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అతనిని స్థానిక పీహెచ్‌సీకి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. ఈ ప్రమాదంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.