Share News

మృతదేహానికి డోలీ..

ABN , Publish Date - Feb 24 , 2026 | 04:04 AM

పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం వనకాబడి నుంచి దేరువాడ గ్రామానికి రోడ్డు సరిగాలేని కారణంగా మృతదేహాన్ని...

మృతదేహానికి డోలీ..

  • గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడి మృతి

  • రెండు కిలోమీటర్లు నడిచి వనకాబడి గ్రామానికి తరలింపు

గుమ్మలక్ష్మీపురం, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం వనకాబడి నుంచి దేరువాడ గ్రామానికి రోడ్డు సరిగాలేని కారణంగా మృతదేహాన్ని కర్రకు కట్టుకుని మోసుకెళ్లిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. వనకాబడి గ్రామానికి చెందిన పువ్వల బంగారురాజు (28) అనే గిరిజన యువకుడు ఈ నెల 19న మోటార్‌ బైక్‌పై విశాఖపట్నం వెళ్తుండగా విజయనగరం జిల్లా బూర్జివలస సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన బంగారురాజును తొలుత గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం బంగారురాజు చనిపోయారు. మృతదేహాన్ని పోస్టుమార్టం తర్వాత దేరువాడ వరకు వాహనంలో తీసుకొచ్చారు. అక్కడ నుంచి వనకాబడికి రోడ్డు సరిగాలేని కారణంగా మృతదేహాన్ని కర్రకు కట్టుకుని రెండు కిలోమీటర్ల నడిచి గ్రామానికి తరలించారు. సోమవారం ఉదయం దహన సంస్కారాలు చేశారు. బూర్జివలస పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Feb 24 , 2026 | 04:05 AM