ఏడు కిలోమీటర్లు డోలీలో తీసుకుని వచ్చి..
ABN , Publish Date - Jan 28 , 2026 | 05:32 AM
పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం గిరిశిఖర ఓటకకోసు గ్రామం మైదాన ప్రాంతానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది. గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం కూడా లేదు.
పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం గిరిశిఖర ఓటకకోసు గ్రామం మైదాన ప్రాంతానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది. గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం కూడా లేదు. కొద్దిరోజులుగా ఆ గ్రామంలో కాలువాపుతో వాటక నిమ్మలమ్మ అనే 16 ఏళ్ల గిరిజన బాలిక బాధపడుతోంది. చివరకు నడవలేని పరిస్థితి ఉండడంతో మంగళవారం బాలిక తండ్రి వాటక నరసయ్య, బంధువులు కలిసి డోలీ సాయంతో ఆమెను మైదాన ప్రాంతమైన బట్టిమూగవలస వరకు తెచ్చారు. అక్కడ నుంచి పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి అంబులెన్స్‌లో తరలించారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్యం నికలడగా ఉందని బంధువులు తెలిపారు.
-కొమరాడ, ఆంధ్రజ్యోతి