ఆంక్షలతో రవాణా స్తంభన
ABN , Publish Date - Jun 14 , 2026 | 04:40 AM
డీజిల్, పెట్రోల్ కొనుగోళ్ల విషయంలో ఆంక్షలు విధిస్తే భారతదేశ రవాణా వ్యవస్థ స్తంభించిపోయేప్రమాదం ఉందని నేషనల్ మోటార్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (నమతా) రాష్ట్ర కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది.
200 లీటర్ల డీజిల్.. ఆదేశాల్ని వెనక్కి తీసుకోవాలి
కేంద్రానికి ‘నమతా’ హెచ్చరిక
విజయవాడ సిటీ, జూన్ 13(ఆంధ్రజ్యోతి): డీజిల్, పెట్రోల్ కొనుగోళ్ల విషయంలో ఆంక్షలు విధిస్తే భారతదేశ రవాణా వ్యవస్థ స్తంభించిపోయేప్రమాదం ఉందని నేషనల్ మోటార్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (నమతా) రాష్ట్ర కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈమేరకు శనివారం ఒక ప్రకటన జారీ చేసింది. ట్ర క్కులు, కంటైన ర్లు, ట్యాంక ర్లు, వ్యవసాయ ఉత్పత్తులు, నిత్యావసర వస్తువులు తరలించే వాహనాలు రోజుకు 200 లీటర్ల కన్నా ఎక్కువ డీజిల్ వినియోగిస్తాయని తెలిపారు. అలాంటిది 200 లీటర్లకు మించి డీజిల్ విక్రయించరాదని కేంద్రం ఆదేశాలు జారీ చేయడంపై నమతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ చర్య వాహన యజమానుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోందని పేర్కొంది. ప్రభుత్వ ఆంక్షల కారణంగా డీజిల్ కొరతతో ఎక్కడ లారీలు అక్కడే నిలిచిపోతాయని, పర్యవసానంగా సరకు రవాణా ఆలస్యం కావడంతోపాటు నిత్యావసరాల ధరలు పెరిగి, చివరకు ప్రజలపై భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది.