Share News

Stress Management: వైద్య విద్యార్థుల్లో ఆత్మహత్యల నివారణకు శిక్షణ

ABN , Publish Date - Jan 03 , 2026 | 06:00 AM

వైద్య విద్యార్థులు ఒత్తిడిని అధిగమించడంతో పాటు ఆత్మహత్య ఆలోచనల నుంచి బయటపడేలా మెడికల్‌ కాలేజీల్లో శిక్షణ ఇవ్వనున్నారు.

Stress Management: వైద్య విద్యార్థుల్లో ఆత్మహత్యల నివారణకు శిక్షణ

అమరావతి, జనవరి 2(ఆంధ్రజ్యోతి): వైద్య విద్యార్థులు ఒత్తిడిని అధిగమించడంతో పాటు ఆత్మహత్య ఆలోచనల నుంచి బయటపడేలా మెడికల్‌ కాలేజీల్లో శిక్షణ ఇవ్వనున్నారు. దీనిలో భాగంగా ఆరోగ్యశాఖ కార్యదర్శి సౌరభ్‌గౌర్‌ సమక్షంలో క్వశ్చన్‌ పర్స్యూడ్‌ రిఫర్‌ (క్యూపీఆర్‌) ఇన్‌స్టిట్యూట్‌ ఇండియా సంస్థతో శుక్రవారం ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ అధికారులు ఒప్పందం చేసుకున్నారు. దేశంలోనే తొలిసారిగా వైద్య విద్యార్థుల కోసం నిర్వహించే ఈ శిక్షణ కార్యక్రమాలకు మంత్రి సత్యకుమార్‌ ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా గౌర్‌ మాట్లాడుతూ అమెరికాకు చెందిన డాక్టర్‌ అపర్ణ మూడేళ్ల నుంచి తన సేవలను రాష్ట్రంలో కొనసాగిస్తున్నారని చెప్పారు. విద్యార్థులతో నేరుగా మానసిక వైద్య నిపుణులు సమావేశమై వారి సందేహాల్ని నివృత్తి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్‌ రాధికారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jan 03 , 2026 | 06:02 AM