పెళ్లింట విషాదం!
ABN , Publish Date - May 11 , 2026 | 04:39 AM
సందడి సందడిగా పెళ్లి జరిగిన ఆ ఇంట అంతలోనే అత్యంత విషాదం నెలకొంది. వివాహ తంతు పూర్తిచేసుకుని వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో...
వివాహం పూర్తి చేసుకుని వెళుతుండగా రోడ్డుప్రమాదం
ఆటోను ఢీకొన్న లారీ
పెళ్లి కొడుకు తండ్రి, పెళ్లికూతురు చిన్నాన్న మృతి
వరుని తల్లికి తీవ్రగాయాలు
విజయనగరం/జామి, మే 10 (ఆంధ్రజ్యోతి): సందడి సందడిగా పెళ్లి జరిగిన ఆ ఇంట అంతలోనే అత్యంత విషాదం నెలకొంది. వివాహ తంతు పూర్తిచేసుకుని వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో పెళ్లికొడుకు తండ్రి, పెళ్లికూతురు చిన్నాన్న మృతి చెందారు. విజయనగరం జిల్లా జామి మండలం అన్నమరాజుపేట గ్రామానికి చెందిన యువకుడికి శనివారం రాత్రి పార్వతీపురం జిల్లా పాచిపెంట మండలం తోటవలసలో వివాహం జరిగింది. ఆదివారం ఉదయం వధూవరుల కుటుంబ సభ్యులు ఆటోలో అన్నమరాజుపేటకు వెళ్తుండగా జామి మండలం జన్నివలస హైవే వద్ద రాంగ్‌రూట్‌లో వస్తున్న లారీ టైరు పేలడంతో ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో పెళ్లికుమారుడి తండ్రి మట్టా సన్యాసిరావు (48), పెళ్లికూతురు చిన్నాన్న లావేరు పైడిరాజు (55) మృతిచెందారు. అదే అటోలో ప్రయాణిస్తున్న పెళ్లికొడుకు తల్లి కనకమ్మకు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు.