Share News

ఉరితాడైన ఊయల!

ABN , Publish Date - Feb 19 , 2026 | 04:53 AM

సరదాగా ఊగుతున్న ఊయలే చిన్నారి ఉసురుతీసింది. మార్కాపురం టౌన్‌ ఎస్సై ఎం.సైదుబాబు కథనం మేరకు..

ఉరితాడైన ఊయల!

మార్కాపురం టౌన్‌, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): సరదాగా ఊగుతున్న ఊయలే చిన్నారి ఉసురుతీసింది. మార్కాపురం టౌన్‌ ఎస్సై ఎం.సైదుబాబు కథనం మేరకు.. పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన చేబ్రోలు జయకుమార్‌ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అతని కుమార్తె సునంద భాగ్యలక్ష్మి(7) మంగళవారం రాత్రి ఇంట్లో ఊయల ఊగుతూ ఉంది. ఈ క్రమంలో ఊయల చీర ఆమె మెడకు చుట్టుకుంది. మళ్లీ పక్కకు తిరిగేందుకు బాలిక ప్రయత్నించినా మెడకు చీర ఒరుసుకుపోవడంతో ఊపిరాడలేదు. గమనించిన తల్లి వెంకటమ్మ కుమార్తెను కాపాడేందుకు ప్రయత్నించినా అప్పటికే భాగ్యలక్ష్మి ఊపిరాడక మృతి చెందింది. తండ్రి జయకుమార్‌ ఫిర్యాదు మేరకు టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Feb 19 , 2026 | 04:55 AM