ముగ్గురు మిత్రులను మింగేసిన మృత్యువు
ABN , Publish Date - Apr 23 , 2026 | 03:36 AM
తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లిలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదం ముగ్గురు మిత్రులను మింగేసింది. తాళ్లపూడి ...
చికిత్సకు వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం
నల్లజర/తాళ్లపూడి/కొవ్వూరు, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లిలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదం ముగ్గురు మిత్రులను మింగేసింది. తాళ్లపూడి మండలం గజ్జరానికి చెందిన చాపర్ల హనుమంతరావు(45), చాపల రాజు (40), కొవ్వూరుకు చెందిన దుద్దుపూడి సాగర్ (41) చిన్ననాటి నుంచీ స్నేహితులు. హనుమంతరావు చిన్నప్పటి నుంచీ హీమోఫీలియోతో బాధపడుతుండగా రాజు, సాగర్ చెన్నైలో వైద్యం చేయిస్తున్నారు. ఈ క్రమంలో హనుమంతరావు వైద్యం కోసం ఈ నెల 19న కారులో చెన్నై వెళ్లారు. తిరుగు ప్రయాణంలో మరో గంటలో ఇంటికి చేరుకుంటారనగా తెల్లవారుజామున వీరవల్లి టోల్‌ప్లాజా సమీపంలో వేగంగా వెళుతున్న కారు రోడ్డు పక్కన ఉన్న సూచిక బోర్డును ఢీకొట్టడంతో ముగ్గురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో గాయపడిన గన్నిన నరేంద్ర రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.