Bamboo Mat Weaving: వెదురు కళకు అంతర్జాతీయ ప్రచారం
ABN , Publish Date - Jan 12 , 2026 | 06:37 AM
కాదేదీ కళకు అనర్హం అన్నట్టుగా.. సంప్రదాయ వెదురు చాపలు నేసే కళకు అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం లభించింది.
జంగారెడ్డిగూడెం, జనవరి 11(ఆంధ్రజ్యోతి): కాదేదీ కళకు అనర్హం అన్నట్టుగా.. సంప్రదాయ వెదురు చాపలు నేసే కళకు అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం లభించింది. జంగారెడ్డి గూడెం పట్టణానికి చెందిన డాక్టర్ ముప్పిడి రాంబాబు, గుంటూరుకు చెందిన ప్రొఫెసర్ యోగేశ్ బాబు సంయుక్తంగా(వెదురు మ్యాట్ వీవింగ్) వెదురు చాపలు నేసే విధానంపై పరిశోధనాత్మక వ్యాసం రాశారు. ఈ వ్యా సాన్ని అమెరికాలోని ఇర్వైన్ నుంచి వెలువడే అంతర్జాతీయ జర్నల్ మ్యాగజైన్ ‘కరెంట్ ట్రెండ్స్ ఇన్ ఫ్యాషన్ టెక్నాలజీ అండ్ టెక్స్‌టైల్ ఇంజినీరింగ్’, జునిపర్ పబ్లిషర్స్ ఈ నెల 5న ప్రచురించింది.