ట్రాక్టర్లతో పొలం దున్ని సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు
ABN , Publish Date - Apr 21 , 2026 | 06:03 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు 76వ జన్మ దినోత్సవం సందర్భంగా తిరువూరు నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ళు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు.
విజయవాడ, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు 76వ జన్మ దినోత్సవం సందర్భంగా తిరువూరు నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ళు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. తిరువూరు మండలం చిట్టేల గ్రామానికి చెందిన పార్టీ నాయకులు పొలంలో ‘హ్యాపీ బర్త్ డే సీబీఎన్ సర్ ’ అన్న ఆంగ్ల అక్షరాలుగా ట్రాక్టర్లతో పొలాన్ని దున్నారు. ఈ దృశ్యాలను డ్రోన్ ద్వారా చిత్రీకరణ జరిపి ఆ వీడియోను సామాజిక మాద్యమాలలో పోస్ట్ చేసి ముఖ్యమంత్రి పట్ల తమ అభిమానాన్ని పంచుకున్నారు. తమ ప్రియతమ నేత చంద్రబాబుకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్‌డే సీబీఎన్ సర్ అనే పేరుతో పొలాన్ని దున్నటానికి గత వారం రోజులుగా నాయకులు బొంతు మాధవరావు, బొంతు కిట్టు, సుధాకర్, సంపత్ కుమార్, రవికుమార్, తుమ్మలపల్లి శ్రీనివాసరావు, మునగాల ప్రసాద్, కోగంటి శోభన్‌బాబుకు ప్రాక్టీస్ చేశారు.