Share News

థీమ్‌ పార్కుల ఏర్పాటుకు ఎంవోయులు: దుర్గేశ్‌

ABN , Publish Date - Mar 07 , 2026 | 03:38 AM

రాష్ట్రంలో ప్రపంచస్థాయి వినోద సౌకర్యాలు, థీమ్‌ పార్కుల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని పర్యటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌ శాసనసభలో తెలిపారు.

థీమ్‌ పార్కుల ఏర్పాటుకు ఎంవోయులు: దుర్గేశ్‌

అమరావతి, మార్చి 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రపంచస్థాయి వినోద సౌకర్యాలు, థీమ్‌ పార్కుల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని పర్యటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌ శాసనసభలో తెలిపారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కర్ణూతల గ్రామంలో డిస్నీవరల్డ్‌ ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నాయా? అని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ప్రశ్నించారు. మంత్రి మాట్లాడుతూ ఇమాజికా, వండర్‌లా వంటి సంస్థలు తిరుపతి, విశాఖలో ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆసక్తి చూపాయని అన్నారు. ఇటీవల భాగస్వామ్య సదస్సులో పర్యాటక శాఖ రూ.18,448 కోట్ల విలువైన 102 అవగాహన ఒప్పందాలు చేసిందని, అందులో 3 థీమ్‌ పార్కులకు సంబంధించినవి ఉన్నాయని తెలిపారు.

Updated Date - Mar 07 , 2026 | 03:57 AM