Share News

పంచాయతీలకు గడ్డుకాలం

ABN , Publish Date - Jul 14 , 2026 | 11:59 PM

పంచాయతీలు ఆర్థిక ఇబ్బందులతో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి.

 పంచాయతీలకు గడ్డుకాలం

జిల్లా పంచాయతీ అధికారి

అనుమతిస్తేనే బిల్లులు మంజూరు

నిలిచిన స్టాంప్‌ డ్యూటీ చెల్లింపులు

ఆలూరు, జూలై 7 (ఆంధ్రజ్యోతి): పంచాయతీలు ఆర్థిక ఇబ్బందులతో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. నిధులు దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు ప్రభు త్వం షరతులు విధించింది. గతంలో కార్యదర్శులే బిల్లులు చేసుకునేవారు. ఇప్పడు జి ల్లా పంచాయతీ అధికారి అనుమతించిన తర్వాతే బిల్లులు మంజూరవుతున్నాయి. జి ల్లాలో 484 పంచాయతీల నుంచి ప్రతిరో జు ఎంబుక్‌ను ఆన్‌లైన్‌లో పంపుతున్నారు. వాటిని చూసి పంచాయతీ అధికారి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో డివిజన్‌ స్థాయి పంచాయతీ అధికారి అనుమతి ఇ వ్వాలని సూచించారు. పాలకవర్గాలు గడువుతీరిన తర్వాత జిల్లా పం చాయతీ అధికారికి బాఽ ద్యతలు అప్పగించారు. ప్రస్తుతం ప్రత్యేక అధికారుల పాలన నడుస్తోంది. పాలకవర్గాలు వచ్చేంతవరకు ఇబ్బందులు తప్పవంటూ సి బ్బంది ఒక అంచనాకు వచ్చేశారు. సర్పంచులు ఉన్నట్లయితే అత్యవసర పనుల కోసం సొమ్ము లు సర్దుబాటు చేసేవారు. తదుపరి బిల్లు లు వస్తే తీసుకునేవారు. కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బం ది వేతనాలు కూడా సర్దుబాటు పరిస్థితి ఉండేది. ముఖ్యంగా మంచినీటి సరఫరా చేసేందుకు సిబ్బందికి వేతనాలు కూడా ఇ చ్చేవారు. కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన త ర్వాత పంచాయతీలకు నిధు ల ఖర్చు చేసుకోవడం లో వెసులుబాటు లభించింది. అయితే పాలక వర్గాలు చివరి దశకు వచ్చినప్పు డు మాత్రం ఖజానా ఖాళీ చేస్తారన్న ఉద్దేశంతో కార్యదర్శులకు హెచ్చరికలు జారీ చేశారు. ఇష్టమొచ్చినట్లు ఖర్చులు పెట్టకోవడం, బిల్లులు మంజూరు చేసుకోవడం వంటి చర్యలకు పాల్పడితే క్రమశిక్షణా చర్యలుంటాయని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలొచ్చాయి. దీనివల్ల బిల్లులు మంజూరులో జాప్యం జరుగుతోందని పంచాయతీ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. గడిచిన వేసవిలో మంచినీటి సరఫరాకు కాస్త ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు వానాకాలం వచ్చింది. సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య పనులు చేపట్టాలి. బ్లీచింగ్‌ చల్లాలి. తక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటే నిధులు వెచ్చించాలి. అయితే బిల్లులు మంజూరు కోసం జిల్లా పంచాయతీ అధికారిపై ఆధారపడాల్సి వస్తోంది. ప్రభుత్వ స్థాయిలో గ్రామ పంచాయతీ మాత్రం నిధులు వక్రమార్గం పట్టకుండా ఉండేందుకే షరతులు పెట్టారు.

కొన్ని రకాల బిల్లులు చేయాల్సి ఉంటుంది

పంచాయతీల నిధులు దుర్వినియోగం కాకుండా ఉండేందుకు కొన్ని రకాల బిల్లులు వివిధ స్థాయి అధికారుల ద్వారా మంజూరు చేయించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు వచ్చాయి. పెద్ద పనులు, సిబ్బంది వేతనాలు అన్ని డీపీవో ద్వారా మంజూరు చేయాలి. ఇలా చేయడం వల్ల నిధులు దుర్వినియోగమయ్యే అవకాశం ఉండదు.

- భాస్కర్‌, జిల్లా పంచాయతీ అధికారి

Updated Date - Jul 14 , 2026 | 11:59 PM