నేటితో ముగియనున్న స్పర్శ దర్శనం
ABN , Publish Date - Mar 14 , 2026 | 11:43 PM
మల్లన్న గర్భాలయ స్పర్శ దర్శనం 15వ తేదీ ఆదివారం వరకు మాత్రమే కల్పించనున్నట్లు ఆలయ అధికారులు నిర్ణయించారు. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాదయాత్రగా వస్తున్నారు.
శ్రీశైలం, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): మల్లన్న గర్భాలయ స్పర్శ దర్శనం 15వ తేదీ ఆదివారం వరకు మాత్రమే కల్పించనున్నట్లు ఆలయ అధికారులు నిర్ణయించారు. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాదయాత్రగా వస్తున్నారు. భక్తుల అభీష్టం మేరకు నేటి వరకు మాత్రమే స్పర్శ దర్శనం టిక్కెట్లు అందుబాటులో ఉంచుతున్నారు. ప్రస్తుతం నాలుగు విడతలుగా క్యూలైన వద్ద ప్రత్యేక టిక్కెట్టు కౌంటర్లు ఏర్పాటుచేసి ప్రతి విడతలో సుమారు 5 వేల టిక్కెట్లకు పైగా జారీచేస్తూ స్పర్శ దర్శనం కల్పిస్తున్నారు. అలంకార దర్శనం కోసం కంపార్టుమెంట్లలో గంటల తరబడి వేచి ఉండే భక్తులను దృష్టిలో ఉంచుకుని తక్కువ సమయంలో స్వామిఅమ్మవార్ల దర్శనం కల్పించేందుకు అందరికీ అలంకార దర్శనం మాత్రమే కల్పించేందుకు ఆలయ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. స్వామిఅమ్మవార్ల దర్శనం చేసుకునేందుకు భక్తులు సంయమనం పాటించాలని ఈవో శ్రీనివాసరావు కోరారు.