Share News

టమోఠా

ABN , Publish Date - Aug 21 , 2026 | 11:31 PM

ల్‌నినో ప్రభావంతో ప్రధాన వాణిజ్య పంటలు ఎండిపోయాయి. ప్రత్యామ్నాయంగా సాగుచేసిన టమోటా పంట రైతును నిలువునా ముంచేస్తోంది.

   టమోఠా
పత్తికొండ మార్కెట్‌యార్డుకు వచ్చిన టమోటా

కిలో రూ.3

ఆరంభంలోనే పడిపోయిన

గిట్టుబాటు కాని కూలీలు

ఆందోళనలో రైతన్నలు

పత్తికొండ, ఆగస్టు 21. (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో ప్రధాన వాణిజ్య పంటలు ఎండిపోయాయి. ప్రత్యామ్నాయంగా సాగుచేసిన టమోటా పంట రైతును నిలువునా ముంచేస్తోంది. మార్కెట్లో గిట్టుబాటు ధరలు లభించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. టమోటా కిలో రూ.3కు పడిపోయింది. పెట్టుబడుల మాట అటుంచి పంట కోతకోసిన కూలీలు, మార్కెట్‌కు తరలించిన రవాణా చార్జీలు కూడా దక్కడం లేదని ఆందోళన చెందుతున్నారు. పత్తికొండ మార్కెట్‌యార్డులో శుక్రవారం 15కిలోల గంపలు జత రూ.100 వ్యాపారులు కొనుగోలు చేశారు. వ్యాపారుల 10శాతం కమీషన పోగా చేతికి వచ్చే మొత్తం దేనికి సరిపోవని రైతులు ఆరోపిస్తున్నారు. ప్ర భుత్వం టమోటాకు ఽగిట్టుబాటు ధరకల్పించేందుకు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

ప్రభుత్వం టమోటా రైతులను ఆదుకోవాలి

రెండెకరాల్లో టమోటాను సాగుచేశా. ముగ్గురు కూలీలు ఒక్కొక్కరికి రూ.300, మరో ముగ్గురు కుటుంబ సభ్యులతో కలిసి కోత కోశాం. గంపకు రూ.20 ఆటోచార్జీ చెల్లించి పత్తికొండ మార్కెట్‌కు తెచ్చా. ఇక్కడ వ్యాపారులు జత గంపలు రూ.100కు కొన్నారు. అన్నీ పోనూ నాకే రూ.150 ఎదురు ఖర్చు అయ్యింది. ప్రభుత్వం టమోటా రైతులను ఆదుకోవాలి.

ఫ రంగమ్మ, రైతు, పందికోన

కూలీలు గిట్టుబాటు కావడం లేదు

ఎకరా పొలంలో టమోటాను సాగుచేశా. శుక్రవారం 6గురు కూలీలను పెట్టి 22 బాక్సులు (20కిలోలు) టమోటాలను మార్కెట్‌కు తెచ్చా. జత బాక్సులు రూ.240తో వ్యాపారులు కొనుగోలు చేశారు. మొత్తం రూ.2,640 కాగా 10శాతం కమీషన పోనూ రూ.2,376 చేతికొచ్చింది. కోత కూలీలు ఆరుగురికి రూ1,800, ఆటోకు రూ.440 పోగా చేతికి రూ.136 వచ్చింది. ఎకరాకు రూ.20వేలు పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేస్తే కనీసం పెట్టుబడులు కూడా దక్కని పరిస్థితి.

ఫ కిష్టప్ప, రైతు, హోసూరు

Updated Date - Aug 21 , 2026 | 11:32 PM