Legal Metrology Department: తూనికలు, కొలతలపై ఫిర్యాదులకు టోల్ ఫ్రీ 1100
ABN , Publish Date - Jan 10 , 2026 | 05:15 AM
తూనికలు, కొలతలు, ప్యాకేజ్డ్ ఉత్పత్తులు మొదలైన వాటికి సంబంధించి ఎదురయ్యే సమస్యలను పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రసల్ సిస్టమ్...
అమరావతి, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): తూనికలు, కొలతలు, ప్యాకేజ్డ్ ఉత్పత్తులు మొదలైన వాటికి సంబంధించి ఎదురయ్యే సమస్యలను పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రసల్ సిస్టమ్ (జీపీఆర్‌ఎస్) టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబరు 1100కు కాల్ చేసి నమోదు చేసుకుంటే.. ఆ ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని లీగల్ మెట్రాలజీ జాయింట్ కంట్రోల్ కృష్ణచైతన్య అంగోతు హామీ ఇచ్చారు. ఈ అంశంపై రాష్ట్రంలోని జాయింట్ కంట్రోలర్లు, డిప్యూటీ కంట్రోలర్లందరూ ప్రత్యేక చొరవ చూపించాలని ఆమె శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.