ఎమ్మెల్యే వాహనాన్నే ఆపుతారా?
ABN , Publish Date - Apr 26 , 2026 | 04:39 AM
ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే.. కుటుంబంతో కలిసి వాహనం లో ప్రయాణిస్తున్నారు. టోల్‌గేట్ వద్ద సిబ్బంది ఆపా రు. అంతే..! ఎమ్మెల్యే వాహనాన్నే ఆపుతారా? ఎంత ధైర్యం? అంటూ టోల్‌గేట్ సిబ్బందిపై ఎమ్మెల్యే అనుచరులు, ఎస్కార్ట్ పోలీసులు దాడికి దిగారు.
కల్యాణదుర్గం శాసనసభ్యుడి అనుచరుల వీరంగం
టోల్‌గేట్ సిబ్బందిపై దాడి.. ఇద్దరికి తీవ్రగాయాలు
ఆపై బాధితులను ఈడ్చుకుంటూ పోలీస్ స్టేషన్‌కు..
దాడి జరుగుతున్నంతసేపూ కారులోనే సురేంద్రబాబు
వాల్మీకిపురం, ఏప్రిల్ 25(ఆంధ్రజ్యోతి): ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే.. కుటుంబంతో కలిసి వాహనం లో ప్రయాణిస్తున్నారు. టోల్‌గేట్ వద్ద సిబ్బంది ఆపా రు. అంతే..! ఎమ్మెల్యే వాహనాన్నే ఆపుతారా? ఎంత ధైర్యం? అంటూ టోల్‌గేట్ సిబ్బందిపై ఎమ్మెల్యే అనుచరులు, ఎస్కార్ట్ పోలీసులు దాడికి దిగారు. విచక్షణారహితంగా కొట్టారు. ఇదంతా ఆ ఎమ్మెల్యే సమక్షం లోనే జరిగినా ఆయన చోద్యం చూస్తూ కారులోనే కూర్చొ న్నారు. శనివారం ఉదయం అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలంలో చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాలివీ. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల నుంచి వస్తున్నారు. ఆయన వాహనాన్ని అన్నమయ్య జిల్లా లోని వాల్మీకిపురం- కలికిరి మార్గమధ్యంలోని టోల్‌గేట్ వద్ద సిబ్బంది ఆపారు. అక్కడ కొద్ది క్షణాలు ఆలస్యమయ్యేసరికి ఎమ్మెల్యే వాహనం వెంబడి ఉన్న ఎస్కా ర్ట్ పోలీసులు, అనుచరులు దూసుకొచ్చి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అంతటితో ఆగక దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో టోల్‌గేట్ మేనే జరు రవి, మహిళా సిబ్బంది శ్రీలతకు తీవ్రంగాను, మిగతా సిబ్బందికి స్వల్పంగా దెబ్బలు తగిలాయి. వాహనానికి ఎమ్మెల్యే స్టిక్కరు ఉన్నా ఎందుకు నిలుపుతారంటూ దుర్భాషలాడారు. టోల్‌గేట్ చెక్‌పోస్టు బారికేడ్లను ధ్వంసం చేశారు. టోల్‌గేట్ సిబ్బందిని ఈడ్చుకుంటూ తమ వాహనంలో వాల్మీకిపురం పోలీస్ స్టేషన్‌కు.. తీసుకెళ్లారు.
ఈ తతంగమంతా సదరు ఎమ్మెల్యే కారులో కూర్చొని చూస్తూ ఉండిపోయారు. దాడి దృశ్యాలు సీసీ కెమెరా లు రికార్డు కావడం, సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అయ్యాయి. పోలీస్ స్టేషన్‌క లో 2గంటల పాటు నడిచిన పంచాయితీలో ఇరువర్గాలు మళ్లీ వాగ్వాదానికి దిగాయి. ఇరు వర్గాలను సీఐ రాఘవరెడ్డి విచారించి, టోల్‌గేట్ సిబ్బందిని మందలించి పంపేశారు. దాడిలో ‘మేమే దెబ్బలుతిని, తిరిగి మేమే క్షమాపణ చెప్పాల్సి రావడం ఏంట’ని టోల్‌గేట్ సిబ్బంది మథనపడుతూ వెళ్లిపోయినట్లు తెలిసింది. ఈ వ్యవహారమంతా సాయంత్రానికిమరోసారి సోషల్ మీడియా లో విపరీతంగా వైరల్ అయింది. కాగా, దాడి అనంతరం, ఎమ్మెల్యేకు రక్షణగా ఉండాల్సిన ఎస్కార్ట్ సిబ్బంది.. టోల్‌గేట్ సిబ్బందిని వాల్మీకిపురం పోలీసు స్టేషనకు లాక్కొని వెళ్లగా, తిరిగి వాళ్లు వచ్చేవరకు సుమారు రెండు గంటలపాటు ఎస్కార్ట్ లేకుండా ఎమ్మెల్యే హైవేపై ఉన్నారని తెలిసింది.