Share News

నేడు జాతీయ క్రీడాదినోత్సవం

ABN , Publish Date - Aug 28 , 2026 | 11:21 PM

జాతీయ హాకీ మాంత్రికుడు మేజర్‌ ధ్యానచంద్‌ జయంతి రోజున జాతీయ క్రీడా దినోత్సవాలను దేశ వ్యాప్తంగా నిర్వహిస్తారు.

   నేడు జాతీయ క్రీడాదినోత్సవం

29న హాకీ మాంత్రికుడు మేజర్‌ ధ్యానచంద్‌ జన్మదినం

కర్నూలు స్పోర్ట్స్‌, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): జాతీయ హాకీ మాంత్రికుడు మేజర్‌ ధ్యానచంద్‌ జయంతి రోజున జాతీయ క్రీడా దినోత్సవాలను దేశ వ్యాప్తంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో క్రీడాప్రతినిధులు, క్రీడాకారులు, హాకీ అసోసియేషన ప్రతినిధులు హాకీ మాంత్రికుడి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రతి ఏడాది జిల్లా క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి, ఏషియన, ప్రపంచ స్థాయి ఒలంపిక్‌ పోటీల్లో హాజరైన జిల్లా క్రీడాకారులకు ట్రాక్‌ షూట్‌, మెమెంటో, ప్రశంసాపత్రంతో క్రీడాకారులను అధికారులు సత్కరించనున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం శాప్‌ ఆధ్వర్యంలో 12 క్రీడాంశములతో తిరుపతిలో రాష్ట్ర స్థాయి అమరావతి చాంపియనషి్‌ప-2026 పోటీలు నిర్వహిస్తున్నారు. అన్ని జిల్లాల విజేతలను ప్రభుత్వం నగదు ప్రోత్సాహం, మెడల్స్‌, ప్రశంసాపత్రాలు అందజేస్తారనీ జిల్లా క్రీడల అభివృద్ది అధికారి భి.భూపతిరావు తెలిపారు. జిల్లా నుండి 300 మంది క్రీడాకారులు, డీఎ్‌సఏ కోచలు, వ్యాయామ ఉపాధ్యాయులు ఈ నెల 31 వరకు తిరుపతిలో క్రీడల్లో హాజరయ్యారు. జిల్లా ఒలింపిక్‌ సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షుడు బొల్లవరం రామాంజనేయులు ఆధ్వర్యంలో అంతర్‌ పాఠశాలల బాలబాలికలకు కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్‌, హ్యాండ్‌బాల్‌, పికిల్‌బాల్‌, కరాటే, మార్షల్‌ ఆర్ట్స్‌ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లోని విజేతలకు కప్‌, మెడల్స్‌, ప్రశంసాపత్రాలు అందజేస్తారని రామాంజనేయులు తెలిపారు.

ఫ ధ్యానచంద్‌ సేవలు చిరస్మరణీయం

- భూపతిరావు, క్రీడల అభివృద్ధి అధికారి, కర్నూలు

మేజర్‌ ధ్యానచంద్‌ సేవలు చిరస్మరణీయం. ప్రతి ఏడాది క్రీడాకారులకు సన్మానం చేయడం ఆనవాయితీ. శాఫ్‌ ఆధ్వర్యంలో స్త్రీ, పురుషులకు 10 క్రీడాంశాలలో ఎంపిక చేసి జిల్లా స్థాయి, జోనల్‌, రాష్ట్ర స్థాయిలలో పోటీలు నిర్వహించారు. శాఫ్‌ ఉత్తర్వులతో ముందుకు సాగుతాం. కలెక్టర్‌ చొరవతో క్రీడాకారులకు సన్మానం చేయడానికి సహకరిస్తాం. అలాగే హాకీ క్రీడతో పాటు ఇతర క్రీడలను జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం ప్రోత్సహించి కర్నూలు జిల్లా క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని కోరుతున్నాము.

Updated Date - Aug 28 , 2026 | 11:21 PM