Share News

‘భూమన’ అనుచరులు చిత్రహింసలు పెట్టారు

ABN , Publish Date - Aug 09 , 2026 | 05:20 AM

వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అనుచరులు దాడి చేసిన ఘటనలో బాధితుడు సుబ్రహ్మణ్యం అలియాస్‌ పత్తి మణి తన గోడు చెప్పుకున్నారు.

‘భూమన’ అనుచరులు చిత్రహింసలు పెట్టారు

  • న్యాయం చేయండి: బాధితుడు పత్తి మణి వినతి

తిరుపతి సిటీ, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అనుచరులు దాడి చేసిన ఘటనలో బాధితుడు సుబ్రహ్మణ్యం అలియాస్‌ పత్తి మణి తన గోడు చెప్పుకున్నారు. తనకు న్యా యం చేయాలని కోరారు. శనివారం తిరుపతిలో ఆయన మాట్లాడారు. ‘‘మూడేళ్ల క్రి తం వైసీపీకి వ్యతిరేకంగా ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ పెట్టినందుకు తిరుపతి నుంచి రెండు వాహనాల్లో రాజంపేట వచ్చిన 14మంది భూమన అనుచరులు నన్ను కిడ్నాప్‌ చేసి, దారుణం గా దాడి చేశారు. నాలుక కోసి, చేతి వేళ్లు కట్‌ చేసి, కంటిపై రాళ్లతో కొట్టారు. కరుణాకర రెడ్డి, ఆయన కుమారుడు అభిన య్‌ అనుచరులు చిత్రహింసలకు గురిచేశారు. చావుబతుకుల మధ్య ఉన్న నన్ను వీడియోకాల్‌ ద్వారా తండ్రీ కొడుకులకు చూపించారు. చంపేసి అలిపిరి అడవుల్లో పడేయమని వారు ఆదేశించారు. అయితే పోలీసులు నాకోసం వెతుకుతున్నారని తెలిసి, పారిపోయే ప్రయత్నంలో ఆస్పత్రికి తరలించారు. వారిని వదిలేసిన పోలీసులు... నాపైనే అక్రమ కేసులు పెట్టారు. వైసీపీ అరాచకాలకు భయపడి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటీవలే హోంమంత్రి అనితకు ఫిర్యాదు చేశా. నాపై దాడి చేసిన, చేయించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి’’ అని పత్తి మణి కోరారు.

Updated Date - Aug 09 , 2026 | 05:22 AM