Share News

కల్తీ నెయ్యితో 22 కోట్ల లడ్డూల తయారీ

ABN , Publish Date - Jan 30 , 2026 | 05:25 AM

శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించి, కోట్లాది మంది భక్తుల మనోభావాలను వైసీపీ గాయపరిచిందంటూ టీడీపీ నేతలు మండిపడ్డారు.

కల్తీ నెయ్యితో 22 కోట్ల లడ్డూల తయారీ

  • వైవీకి తెలిసే కల్తీ నెయ్యి సరఫరా: నీలాయపాలెం

  • కల్తీనెయ్యిపై చర్చించేందుకు జగన్‌ అసెంబ్లీకి రావాలి: మంత్రి కొల్లు

అమరావతి, రాయదుర్గం, జనవరి 29(ఆంధ్రజ్యోతి): శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించి, కోట్లాది మంది భక్తుల మనోభావాలను వైసీపీ గాయపరిచిందంటూ టీడీపీ నేతలు మండిపడ్డారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏపీ బయోడైవర్సిటీ చైర్మన్‌ నీలాయపాలెం విజయకుమార్‌ మాట్లాడుతూ... ‘కల్తీ నెయ్యితో సుమారు 22 కోట్ల తిరుపతి లడ్డూలు తయారు చేసి భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు. అసలు పాలే లేకుండా నెయ్యి తయారీ జరిగినట్లు సిట్‌ నివేదిక ఇవ్వడంతో జగన్‌ పని గోవింద’’ అని వ్యాఖ్యానించారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ...జగన్‌కు ధైర్యం ఉంటే కల్తీ నెయ్యిపై చర్చించేందుకు ఫిబ్రవరి 11 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు రావాలని సవాల్‌ విసిరారు. ప్రభుత్వ విప్‌ కాలువ శ్రీనివాసులు కూడా దీనిపై స్పందించారు.

లడ్డూల్లో కల్తీ వాస్తవం: మంత్రి సవిత

గత ప్రభుత్వంలో తిరుమల లడ్డూల్లో కల్తీ జరగడం వాస్తవమని మంత్రి సవిత అన్నారు. ‘కల్తీకి కేరాఫ్‌ అడ్రస్‌ జగన్‌. మద్యం కల్తీతో పాటు వెంకన్న ప్రసాదాన్ని కల్తీ చేశారు’ అని ధ్వజమెత్తారు.

Updated Date - Jan 30 , 2026 | 05:25 AM