అదే రద్దీ..
ABN , Publish Date - May 25 , 2026 | 05:13 AM
తిరుమలలో ఆదివారం కూడా భక్తుల రద్దీ కొనసాగింది. దాదాపు 24గంటల తర్వాత శ్రీవారి సర్వదర్శనం లభిస్తోంది.
భారీగా తిరుమలకు భక్తులు
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
తిరుమల, మే 24 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో ఆదివారం కూడా భక్తుల రద్దీ కొనసాగింది. దాదాపు 24గంటల తర్వాత శ్రీవారి సర్వదర్శనం లభిస్తోంది. అలిపిరి, శ్రీవారిమెట్టు కాలినడక మార్గాల్లో భక్తులు భారీగా తిరుమలకు చేరుకుంటున్న క్రమంలో కొండ మొత్తం కిటకిటలాడుతోంది. కంపార్టుమెంట్లు, షెడ్లలతోపాటు దాదాపు ఐదు కిలోమీటర్ల మేరకు సర్వదర్శన క్యూలైన్ ఉంది. ఇక, శనివారం అత్యధికంగా 97,561 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే మొక్కులున్న భక్తులు కూడా భారీగా 57,780 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించారు.