వేసవి రద్దీకి విస్తృత ఏర్పాట్లు
ABN , Publish Date - May 04 , 2026 | 04:30 AM
వేసవి సెలవుల రద్దీని దృష్టిలో పెట్టుకుని భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఎండ నుంచి ఉపశమనం కల్పించేలా...
భక్తులకు ఉపశమనం కలిగించేలా టీటీడీ చర్యలు
తిరుమల, మే 3 (ఆంధ్రజ్యోతి): వేసవి సెలవుల రద్దీని దృష్టిలో పెట్టుకుని భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఎండ నుంచి ఉపశమనం కల్పించేలా బాటగంగమ్మ ఆలయ సర్కిల్ నుంచి గోగర్భం డ్యాం సర్కిల్ మీదుగా ఔటర్ రింగురోడ్డు వరకు చలువ పందిళ్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్2, మ్యూజియం ప్రాంగణం, నారాయణగిరి ఉద్యానవనాల్లో షెల్టర్లు ఏర్పాటు చేశారు. క్యూలైన్లు, శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాలు, మాడవీధులలో కూల్ పెయింట్ వేశారు. చాలా ప్రదేశాల్లో తాత్కాలిక మరుగుదొడ్లు నిర్మించారు. మరోవైపు మొబైల్ వాటర్ క్యాన్లతో శ్రీవారి సేవకులు ఎప్పటికప్పుడు భక్తుల వద్దకే వెళ్లి నీరు అందజేస్తున్నారు. అలాగే పారిశుధ్యంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. సాధారణ రోజుల్లో 3.50 లక్షల లడ్డూలను భక్తులకు అందుబాటులో ఉంచగా, రద్దీని దృష్టిలో పెట్టుకుని అదనంగా మరో 3.50 లక్షలను బఫర్‌స్టాక్‌గా అందుబాటులో ఉంచారు.