Share News

17న బ్రేక్‌ దర్శనాలు రద్దు

ABN , Publish Date - Mar 06 , 2026 | 04:15 AM

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 19న ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని 17వ తేదీన కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుంది.

17న బ్రేక్‌ దర్శనాలు రద్దు

తిరుమల, మార్చి 5(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 19న ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని 17వ తేదీన కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుంది. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఆ రోజు శ్రీవారి ఆలయంలో అన్ని ప్రాంతాలను శుద్ధి చేయనున్నారు. ఈ నేపథ్యంలో వీఐపీ బ్రేక్‌ దర్శనాలతో పాటు అష్టదళ పాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. ఈ క్రమంలో 16వ తేదీన ఎలాంటి సిఫారసు లేఖలను స్వీకరించబోమని టీటీడీ స్పష్టం చేసింది.

Updated Date - Mar 06 , 2026 | 04:16 AM