Share News

ముగిసిన శ్రీవారి వసంతోత్సవాలు

ABN , Publish Date - Apr 02 , 2026 | 04:23 AM

తిరుమలలో మూడు రోజులుగా నిర్వహించిన శ్రీవారి వసంతోత్సవాలు బుధవారం ముగిశాయి. మొదటి రెండు రోజులూ శ్రీదేవి, భూదేవి సమేతంగా...

ముగిసిన శ్రీవారి వసంతోత్సవాలు

తిరుమల, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో మూడు రోజులుగా నిర్వహించిన శ్రీవారి వసంతోత్సవాలు బుధవారం ముగిశాయి. మొదటి రెండు రోజులూ శ్రీదేవి, భూదేవి సమేతంగా దర్శనమిచ్చి స్నపనంతో సేదదీరిన మలయప్పస్వామి బుధవారం శ్రీదేవి, భూదేవితో పాటు సీతారామలక్ష్మణ సమేత ఆంజనేయస్వామి, రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులతో కలిసి భక్తులను అనుగ్రహించారు. ప్రతి నెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో నిర్వహించే గరుడ వాహన సేవను వసంతోత్సవం సందర్భంగా రద్దు చేశారు.

Updated Date - Apr 02 , 2026 | 04:23 AM