Share News

శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటలు

ABN , Publish Date - May 23 , 2026 | 05:58 AM

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. వేసవి సెలవులు ముగుస్తున్న క్రమంలో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వాహనాలు, కాలి నడక మార్గాల్లో భారీగా తిరుమలకు చేరుకుంటున్నారు

శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటలు

  • తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

తిరుమల, మే 22(ఆంధ్రజ్యోతి): తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. వేసవి సెలవులు ముగుస్తున్న క్రమంలో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వాహనాలు, కాలి నడక మార్గాల్లో భారీగా తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో తిరుమల మొత్తం యాత్రికులతో కిక్కిరిసిపోయింది. శ్రీవారి ఆలయ ప్రాంతం సహా అన్ని ప్రాంతాలూ కిటకిటలాడుతున్నాయి. శ్రీవారి దర్శనం కోసం వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లతో పాటు నారాయణగిరిలోని షెడ్లన్నీ సర్వదర్శన భక్తులతో నిండిపోయాయి. భక్తుల సౌకర్యార్థం ఆక్టోపస్‌ భవనం సర్కిల్‌ నుంచి విడతల వారీగా క్యూలైన్‌లోకి అనుమతిస్తున్నారు. కాగా.. గురువారం 79,603 మంది శ్రీవారిని దర్శించుకోగా, 45,125మంది తలనీలాలు సమర్పించారు. రూ.4.35 కోట్ల హుండీ ఆదాయం లభించింది.

Updated Date - May 23 , 2026 | 05:59 AM