Share News

శ్రీవారి లడ్డూ అమ్మకాల్లో రికార్డు

ABN , Publish Date - Jun 04 , 2026 | 04:24 AM

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు రికార్డుస్థాయిలో అమ్ముడయ్యాయి. గత నెలలో 1,21,35,528 లడ్డూలను టీటీడీ విక్రయించింది.

శ్రీవారి లడ్డూ అమ్మకాల్లో రికార్డు

  • గత నెలలో 1.21 కోట్లు అమ్మకం

తిరుమల, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు రికార్డుస్థాయిలో అమ్ముడయ్యాయి. గత నెలలో 1,21,35,528 లడ్డూలను టీటీడీ విక్రయించింది. వేసవి రద్దీకి అనుగుణంగా రోజుకు సగటున 4.08 లక్షల లడ్డూలను టీటీడీ తయారు చేస్తోంది. సాధారణ రోజుల్లో 4 లక్షల నుంచి 4.5 లక్షల వరకు లడ్డూలు తయారవుతుండగా, ప్రత్యేక సందర్భాల్లో ఉత్పత్తిని మరింత పెంచుతున్నారు. ఈక్రమంలో మే నెలలో లడ్డూలకు కొరత లేకుండా రికార్డుస్థాయిలో విక్రయించారు. 2024 మే నెలలో 1.01 కోట్లు, 2025లో 1.10 కోట్ల లడ్డూలను విక్రయించారు. ఈ ఏడాది 11 లక్షల లడ్డూలు అదనంగా విక్రయమయ్యాయి.

Updated Date - Jun 04 , 2026 | 04:24 AM