Share News

శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటలు

ABN , Publish Date - May 20 , 2026 | 05:42 AM

తిరుమలలో మంగళవారం కూడా భక్తుల రద్దీ కొనసాగింది. వేసవి సెలవులు చివరిదశకు చేరుకుంటున్న క్రమంలో గత శుక్రవారం నుంచి భక్తుల రద్దీ నెలకొన్న విషయం తెలిసిందే.

శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటలు

తిరుమల, మే 19 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో మంగళవారం కూడా భక్తుల రద్దీ కొనసాగింది. వేసవి సెలవులు చివరిదశకు చేరుకుంటున్న క్రమంలో గత శుక్రవారం నుంచి భక్తుల రద్దీ నెలకొన్న విషయం తెలిసిందే. అదనపు ఈవో వెంకయ్య చౌదరి వివిధ విభాగాల అధికారులను నిరంతరాయంగా అప్రమత్తం చేస్తూ ఏఐ ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ద్వారా క్యూలైన్లను వేగంగా ముందుకు కదిలిస్తున్నారు. క్యూల్లో ఎక్కడా ఖాళీలు లేకుండా, సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం సాయంత్రం ఆరు గంటల సమయానికి 47,569 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.

Updated Date - May 20 , 2026 | 05:42 AM