Share News

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

ABN , Publish Date - Feb 15 , 2026 | 04:15 AM

తిరుమలలో శనివారం భక్తుల రద్దీ పెరిగింది. రెండవ శనివారంతో పాటు ఆదివారం, పైగా శివరాత్రి కావడంతో శ్రీవారి దర్శనార్థం భక్తులు భారీగా తిరుమలకు చేరుకున్నారు.

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమల, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): తిరుమలలో శనివారం భక్తుల రద్దీ పెరిగింది. రెండవ శనివారంతో పాటు ఆదివారం, పైగా శివరాత్రి కావడంతో శ్రీవారి దర్శనార్థం భక్తులు భారీగా తిరుమలకు చేరుకున్నారు. ఈక్రమంలో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోయి క్యూలైన్‌ కృష్ణతేజ విశ్రాంతి భవనం మీదుగా శిలాతోరణం సర్కిల్‌ వరకు వ్యాపించింది. వీరికి దాదాపు 14 గంటల దర్శన సమయం పడుతోంది. ఇక, టైంస్లాట్‌ భక్తులకు కూడా దాదాపు మూడు గంటల తర్వాత దర్శనం లభిస్తోంది. మరోవైపు రద్దీ పెరిగిన క్రమంలో శ్రీవారి ఆలయ ప్రాంతంతో పాటు మాడవీధులు, అఖిలాండం, లడ్డూ కేంద్రం, అన్నప్రసాద భవనం, ఆర్టీసీ బస్టాండ్‌, ప్రధాన కూడళ్లలో భక్తుల సందడి నెలకొంది.

Updated Date - Feb 15 , 2026 | 04:16 AM