Share News

తిరుమల క్యూలైన్‌లో భక్తుల మధ్య ఘర్షణ

ABN , Publish Date - Mar 03 , 2026 | 04:05 AM

తిరుమల సర్వదర్శన క్యూలైన్‌లో ఇద్దరు భక్తుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఓ భక్తుడిపై మరో భక్తుడు బెల్ట్‌తో దాడి చేయడంతో..

తిరుమల క్యూలైన్‌లో భక్తుల మధ్య ఘర్షణ

  • వాగ్వాదం ముదిరి బెల్ట్‌తో దాడి

తిరుమల, మార్చి 2(ఆంధ్రజ్యోతి): తిరుమల సర్వదర్శన క్యూలైన్‌లో ఇద్దరు భక్తుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఓ భక్తుడిపై మరో భక్తుడు బెల్ట్‌తో దాడి చేయడంతో క్యూలైన్‌లోని భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. కృష్ణతేజ విశ్రాంతి భవనం సమీపంలోని సర్వదర్శన క్యూలైన్‌లో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సహనం కోల్పోయిన ఓ భక్తుడు తాను ధరించిన బెల్ట్‌ తీసి దాడి చేశాడు. తోటి భక్తులు అడ్డుకుని సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది. కాగా, భక్తుల మధ్య జరిగిన ఘర్షణ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ అంశంపై టీటీడీ స్పందిస్తూ, భక్తులు పరస్పర ఘర్షణకు దిగిన క్రమంలో విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బంది, సేవకులు అప్రమత్తమై నిలువరించారని ఓ ప్రకటనలో పేర్కొంది. తోటి భక్తులతో స్నేహపూర్వకంగా ఉండాలని, క్యూలైన్‌ నియమాలను తప్పనిసరిగా పాటిస్తూ సంయమనం పాటించాలని కోరింది.

Updated Date - Mar 03 , 2026 | 04:11 AM