Share News

12నుంచి తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు

ABN , Publish Date - Sep 28 , 2026 | 06:13 AM

తిరుమల శ్రీవేంకటేశ్వరుని నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 12 నుంచి 20వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి

12నుంచి తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు
TIRUMALA

16న గరుడ సేవ

తిరుమల, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవేంకటేశ్వరుని నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 12 నుంచి 20వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. చాంద్రమానం ప్రకారం ప్రతి మూడేళ్లకోసారి అధికమాసం వస్తుంది. ఇలా వచ్చిన సందర్భాల్లో కన్యామాసం(భాద్రపదం) లో వార్షిక బ్రహ్మోత్సవాలు, దసరా నవరాత్రుల్లో(ఆశ్వయుజం) నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం, పెద్దరథం, ధ్వజావరోహణం ఉండవు. వాహన సేవలు రోజూ ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు జరుగుతాయి. బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ 11వ తేదీన రాత్రి నిర్వహిస్తారు. ప్రత్యేకించి అక్టోబరు 16న గరుడసేవ, 17న పుష్పకవిమానం, 19న స్వర్ణరథం నిర్వహిస్తారు. దసరా సెలవులు ఉండటంతో నవరాత్రి బ్రహ్మోత్సవాలకు రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. అందుకు తగినట్టు ఏర్పాట్లు చేస్తోంది.

వాహన సేవలు ఇలా

12.10.2026 - బంగారు తిరుచ్చి - పెద్దశేషవాహనం

13.10.2026 - చిన్నశేష వాహనం - హంసవాహనం

14.10.2026 - సింహ వాహనం - ముత్యపుపందిరి వాహనం

15.10.2026 - కల్పవృక్ష వాహనం - సర్వభూపాల వాహనం

16.10.2026 - మోహినీ అవతారం -

గరుడవాహనం (సాయంత్రం 6.30 గంటలకు)

17.10.2026 - హనుమంత వాహనం - పుష్పక విమానం

18.10.2026 - సూర్యప్రభ వాహనం - చంద్రప్రభ వాహనం

19.10.2026 - స్వర్ణరథం - అశ్వవాహనం

20.10.2026 - చక్రస్నానం(ఉదయం 6 గంటలకు)

Updated Date - Sep 28 , 2026 | 06:17 AM