Share News

భారీగా పెరిగిన తిరుమల లడ్డూల విక్రయాలు

ABN , Publish Date - Apr 11 , 2026 | 03:05 AM

తిరుమల శ్రీవారి లడ్డూల విక్రయాలు పెరిగాయి. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 13.95 కోట్ల లడ్డూలను విక్రయించారు. 2025 ఏప్రిల్‌ నుంచి 2026 ..

భారీగా పెరిగిన తిరుమల లడ్డూల విక్రయాలు

  • గతేడాది కంటే 1.76 కోట్లు అదనంగా అమ్మకం..

  • రూ. 567 కోట్లు ఆర్జన

తిరుమల, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి లడ్డూల విక్రయాలు పెరిగాయి. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 13.95 కోట్ల లడ్డూలను విక్రయించారు. 2025 ఏప్రిల్‌ నుంచి 2026 మార్చి వరకు 13,95,43,231 లడ్డూలను భక్తులకు విక్రయించగా, 2024-25లో 12,18,53,535 లడ్డూలను అమ్మారు. అంటే ఏడాదిలో అదనంగా 1.76 కోట్ల లడ్డూలను విక్రయించారు. టీటీడీ ప్రస్తుతం రోజుకు 4 లక్షల లడ్డూలను తయారు చేస్తున్న విషయం తెలిసిందే. శ్రీవారిని దర్శించుకునే ప్రతి ఒక్కరికి ఒక లడ్డూను ఉచితంగా ఇవ్వడంతో పాటు అదనంగా కావాలనుకునే వారికి రూ. 50కి ఒకటి చొప్పున అమ్ముతోంది. గడిచిన వార్షిక ఏడాదిలో లడ్డూల విక్రయాల ద్వారా రూ. 567 కోట్లు వచ్చినట్టు సమాచారం. కాగా, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీవారి లడ్డూల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించిన విషయం తెలిసిందే. నెయ్యి నాణ్యతను పెంచడంతో పాటు ముడి సరుకుల కొనుగోళ్లలో ప్రత్యేక శ్రద్ధ వహించారు. లడ్డూల నాణ్యత పెరిగిందంటూ భక్తుల నుంచి ప్రశంసలందాయి. దీనికి నిదర్శనంగా గడిచిన ఏడాది భారీగా లడ్డూలు అమ్ముడయ్యాయి.

Updated Date - Apr 11 , 2026 | 03:05 AM