తిరుమల గోగర్భం డ్యామ్ వద్ద వ్యర్థాలపై పిల్
ABN , Publish Date - Mar 13 , 2026 | 04:26 AM
తిరుమల గోగర్భం డ్యామ్ వద్ద పేరుకుపోయిన 86 వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది
కౌంటర్ దాఖలుకు ప్రతివాదులకు హైకోర్టు ఆదేశం
అమరావతి, మార్చి 12(ఆంధ్రజ్యోతి): తిరుమల గోగర్భం డ్యామ్ వద్ద పేరుకుపోయిన 86 వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న దేవదాయశాఖ ముఖ్యకార్యదర్శి, టీటీడీ ఈవో, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి, అటవీశాఖ తదితర శాఖలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగువారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. కాగా, పిటిషనర్ చీనేపల్లి కిరణ్‌కుమార్ తరపున న్యాయవాది డీఎ్‌సఎన్వీ ప్రసాద్‌బాబు వాదనలు వినిపించారు.