Share News

తిరుమలలో గోబీ వంటకాలపై నిషేధం

ABN , Publish Date - Aug 22 , 2026 | 04:38 AM

తిరుమలలో గోబీ (కాలీఫ్లవర్‌) వంటకాలను టీటీడీ నిషేధించింది. భక్తుల ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో భాగంగా ఇప్పటికే తిరుమలలోని రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లలో..

తిరుమలలో గోబీ వంటకాలపై నిషేధం

తిరుమల, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): తిరుమలలో గోబీ (కాలీఫ్లవర్‌) వంటకాలను టీటీడీ నిషేధించింది. భక్తుల ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో భాగంగా ఇప్పటికే తిరుమలలోని రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లలో చైనీస్‌ వంటకాలను నిషేధించారు. టీటీడీ హెల్త్‌ డిప్యూటీ ఈవో సోమన్నారాయణ శుక్రవారం తిరుమలలోని రెస్టారెంట్లు, హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్ల నిర్వాహకులతో సమావేశమయ్యారు. ఇటీవల కాలీఫ్లవర్‌లో పురుగులు రావడాన్ని గుర్తించామని, భక్తుల ఆరోగ్య శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని తాత్కాలికంగా గోబీ వినియోగాన్ని నిషేధిస్తున్నట్టు ప్రకటించారు.

Updated Date - Aug 22 , 2026 | 04:39 AM