Share News

సామాన్య భక్తులకే అధిక ప్రాధాన్యం

ABN , Publish Date - May 20 , 2026 | 05:44 AM

శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే సామాన్య భక్తులకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్‌ అన్నారు.

సామాన్య భక్తులకే అధిక ప్రాధాన్యం

  • తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి అనగాని సత్యప్రసాద్‌

తిరుమల, మే 19 (ఆంధ్రజ్యోతి): శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే సామాన్య భక్తులకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్‌ అన్నారు. తిరుమల శ్రీవారిని మంగళవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. మంత్రికి వేదపండితులు ఆశీర్వచనం చేయగా, అధికారులు లడ్డూప్రసాదాలు అందజేశారు. దర్శనానంతరం ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో విపరీతమైన రద్దీ నెలకొందన్నారు. సామాన్య భక్తులకు వేగంగా దర్శనం చేయించాలని టీటీడీ బోర్డు సభ్యులు, ఈవో, అదనపు ఈవో తాపత్రయ పడుతూ తగిన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. కాగా, రాష్ట్రం బాగుండాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి లోకేశ్‌ విశేషంగా కృషి చేస్తున్నారని, స్వామి ఆశీస్సులతో పెట్టుబడులు కూడా చాలా వస్తున్నాయన్నారు. రాష్ట్రం పునర్నిర్మాణానికి ఆశీస్సులు ఇవ్వాలని శ్రీవారిని కోరుకున్నట్టు చెప్పారు.

Updated Date - May 20 , 2026 | 05:44 AM