Share News

తిరుమలలో పెరిగిన రద్దీ

ABN , Publish Date - Apr 05 , 2026 | 05:00 AM

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వారాంతం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు శనివారం భారీగా తిరుమలకు చేరుకున్నారు. ఆలయ ప్రాంతంతో పాటు...

తిరుమలలో పెరిగిన రద్దీ

  • సర్వ దర్శనానికి 12 గంటలు

తిరుమల, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వారాంతం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు శనివారం భారీగా తిరుమలకు చేరుకున్నారు. ఆలయ ప్రాంతంతో పాటు మాడవీధులు, కాటేజీలు, ప్రధాన కూడళ్లు రద్దీగా మారాయి. గదులు పొందే కార్యాలయాలు, తలనీలాలు సమర్పించే కల్యాణకట్టలు, లడ్డూ, అన్నప్రసాద కేంద్రాల్లో కూడా భక్తుల సందడి నెలకొంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని 9 షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోయాయి. కృష్ణతేజ విశ్రాంతి భవనం మీదుగా రింగురోడ్డులో శిలాతోరణం సర్కిల్‌ వరకు క్యూలైన్‌ వ్యాపించింది. వీరికి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. అలిపిరి, శ్రీవారిమెట్టు కాలినడక మార్గాలు కూడా రద్దీగా మారాయి. ఇక, ఆదివారం వేకువజామున 5 గంటలకు జారీ చేసే స్లాటెడ్‌ సర్వదర్శనం(ఎ్‌సఎ్‌సడీ) టోకెన్ల కోసం భక్తులు తిరుపతిలోని విష్ణునివాసం, శ్రీనివాసం, అలిపిరిలో భూదేవి కాంప్లెక్స్‌ వద్ద శనివారం మధ్యాహ్నం నుంచే చేరుకున్నారు.

Updated Date - Apr 05 , 2026 | 05:01 AM