Share News

శ్రీవారి దర్శనానికి 14 గంటలు

ABN , Publish Date - May 03 , 2026 | 04:47 AM

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. పదో తరగతి పరీక్షల ఫలితాలు వెల్లడికావడంతో పాటు వారాంతం కావడంతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది.

శ్రీవారి దర్శనానికి 14 గంటలు

  • తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

తిరుమల, మే 2(ఆంధ్రజ్యోతి): తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. పదో తరగతి పరీక్షల ఫలితాలు వెల్లడికావడంతో పాటు వారాంతం కావడంతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. శ్రీవారి ఆలయ ప్రాంతంతో పాటు మాడవీఽధులు, లడ్డూ కేంద్రం, అఖిలాండం, ప్రఽధాన కూడళ్లు, రిసెప్షన్‌ కౌంటర్లు, కల్యాణకట్టలు రద్దీగా కన్పిస్తున్నాయి. కాలి నడక మార్గాల్లో రద్దీ తగ్గలేదు. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని 9 షెడ్లు నిండిపోయి క్యూలైన్‌ శిలాతోరణం, బాటగంగమ్మ ఆలయం మధ్య వరకు వ్యాపించింది. వీరికి దర్శనానికి దాదాపు 14 గంటల సమయం పడుతోంది.

Updated Date - May 03 , 2026 | 04:48 AM