వద్దన్నా హద్దు మీరుతున్నారు...
ABN , Publish Date - Jan 29 , 2026 | 03:44 AM
ఎన్ని హెచ్చరికలు చేసినా తిరుమలలో ‘నిషేధ’ ఉల్లంఘనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. కొందరు అత్యుత్సాహంతో చేసే చర్యలు భక్తులకు మనస్తాపం కలిగిస్తున్నాయి...
తిరుమలలో ఓ జంట ఫొటో షూట్
పట్టించుకోని భద్రతా సిబ్బంది
తిరుమల, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): ఎన్ని హెచ్చరికలు చేసినా తిరుమలలో ‘నిషేధ’ ఉల్లంఘనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. కొందరు అత్యుత్సాహంతో చేసే చర్యలు భక్తులకు మనస్తాపం కలిగిస్తున్నాయి. తాజాగా తిరుమల శ్రీవారి ఆలయం ముందు ఒక జంట ఫొటో షూట్ చూసి భక్తులు విస్తుపోయారు. బుధవారం ఉదయం పెళ్లి దుస్తుల్లో ఉన్న జంట గొల్లమండపానికి అతి సమీపంలో ఫొటో షూట్‌లో పాల్గొన్నారు. ప్రత్యేక లైట్ల వెలుగులో షూటింగ్ జరిగింది. ఈ క్రమంలో నుదుటిపై ముద్దులు పెట్టుకుంటున్న వీడియోలు, ఫొటోలు తీశారు. గొల్లమండపం నుంచి అఖిలాండం వరకు నడుస్తూ ఫోజులిచ్చారు. ఆలయ ప్రాంగణంలో ఇటువంటివి నిషేధం, అయితే భద్రతా సిబ్బంది ఎవరూ వీరిని అడ్డుకోకపోవడం గమనార్హం.