తప్పని తెలీదు.. క్షమించండి
ABN , Publish Date - Jan 30 , 2026 | 04:57 AM
శ్రీవారి ఆలయం ముందు ఫొటోలు, వీడియోలు తీయడం తప్పని తెలీదు. క్షమించండి’ అంటూ తిరుమలలో వెడ్డింగ్ షూట్ నిర్వహించి విమర్శల పాలైన తిరువణ్ణామలైకు చెందిన తిరుమాల్....
తిరుమలలో వెడ్డింగ్ షూట్‌లో పాల్గొన్న నూతన దంపతులు
తిరుమల, జనవరి29(ఆంధ్రజ్యోతి): ‘శ్రీవారి ఆలయం ముందు ఫొటోలు, వీడియోలు తీయడం తప్పని తెలీదు. క్షమించండి’ అంటూ తిరుమలలో వెడ్డింగ్ షూట్ నిర్వహించి విమర్శల పాలైన తిరువణ్ణామలైకు చెందిన తిరుమాల్, గాయత్రి క్షమాపణలు కోరుతూ గురువారం వీడి యో విడుదల చేశారు. ఆలయం వద్ద ఫొటోలు తీయకూడదనే నిబంధన ఉన్నట్టు తెలీదని, నియమాలకు విరుద్ధమని తెలిసిన వెంటనే వాటిని డిలీట్ చేశామన్నారు. అందరికీ క్షమాపణలు చెబుతున్నామని, ప్రాయశ్చిత్తంగా శ్రీవారిసేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.