శ్రీవారి ఆలయంలో 17న ఆణివార ఆస్థానం
ABN , Publish Date - Jul 06 , 2026 | 05:46 AM
తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 17న ఆణివార ఆస్థానం జరుగుతుంది. ఈ సందర్భంగా సాయంత్రం ఆరు గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి..
తిరుమల, జూలై 5 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 17న ఆణివార ఆస్థానం జరుగుతుంది. ఈ సందర్భంగా సాయంత్రం ఆరు గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి అత్యంత శోభాయమానంగా అలంకరించిన పుష్పపల్లకిపై తిరుమల పురవీధుల్లో విహరిస్తూ భక్తులకు కనువిందు చేస్తారు. ఈ ఉత్సవం నేపథ్యంలో 17వ తేదీన కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.