సర్వర్ మొరాయింపు.. ఆఫ్‌లైన్‌లోనే శ్రీవాణి టికెట్లు
ABN , Publish Date - Apr 12 , 2026 | 05:13 AM
సర్వర్‌లో సాంకేతిక సమస్య కారణంగా రోజూ ఆన్‌లైన్‌లో జారీ చేసే శ్రీవాణి టికెట్ల కేటాయింపులో శనివారం ఇబ్బందులు తలెత్తాయి. ఫలితంగా టీటీడీ ఆఫ్‌లైన్ ద్వారానే శ్రీవాణి టికెట్లను జారీ చేసింది.
తిరుమల, శ్రీశైలం ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): సర్వర్‌లో సాంకేతిక సమస్య కారణంగా రోజూ ఆన్‌లైన్‌లో జారీ చేసే శ్రీవాణి టికెట్ల కేటాయింపులో శనివారం ఇబ్బందులు తలెత్తాయి. ఫలితంగా టీటీడీ ఆఫ్‌లైన్ ద్వారానే శ్రీవాణి టికెట్లను జారీ చేసింది. శనివారం ఉదయం నుంచే సర్వర్లు పనిచేయకపోవడంతో శ్రీవాణి టికెట్ల బుకింగ్‌లో సమస్యలు ఎదురయ్యాయి. దీంతో తిరుమలలోని అన్నమయ్య భవనం ఎదురుగా ఉన్న పాత శ్రీవాణి టికెట్ల జారీ కౌంటర్‌లో ఆఫ్‌లైన్ ద్వారా కేటాయించారు. ఇక, ఆదివారం నుంచి ఆన్‌లైన్‌లోనే ఈ టోకెన్లను కేటాయిస్తామని టీటీడీ ప్రకటించింది. అటు.. శ్రీశైలం దేవస్థానం వెబ్‌సైట్‌లోనూ సాంకేతిక సమస్య తలెత్తడంతో మల్లికార్జున స్వామి దర్శనానికి టికెట్లను బుక్ చేసేందుకు భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మధ్యాహ్నం రెండు గంటల పాటు వెబ్‌సైట్ సర్వర్ మొరాయించడంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో టికెట్ల బుకింగ్‌లో సమస్య తలెత్తినట్టు ఆలయ అధికారులు తెలిపారు.