Share News

అభిషేక సేవలో 6,300 మంది సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనభాగ్యం

ABN , Publish Date - Jun 06 , 2026 | 05:10 AM

తిరుమలలో వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని ఎక్కువమంది సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించడానికి టీటీడీ చర్యలు చేపడుతోంది.

అభిషేక సేవలో 6,300 మంది సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనభాగ్యం

తిరుమల, జూన్‌ 5(ఆంధ్రజ్యోతి): తిరుమలలో వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని ఎక్కువమంది సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించడానికి టీటీడీ చర్యలు చేపడుతోంది. దీనిలో భాగంగా శుక్రవారం 14 కంపార్టుమెంట్లలోని 6,300 మంది భక్తులను అభిషేక సేవలో దర్శనానికి అనుమతించారు. సాధారణంగా ఈ సేవ జరుగుతున్న సమయంలో సామాన్య భక్తులను దర్శనానికి అనుమతించరు. అయితే నిరీక్షణ సమయాన్ని తగ్గించి త్వరితగతిన ఎక్కువమందికి దర్శనం కల్పించడంలో భాగంగా గతనెల 22న కూడా 5,850 మందిని అభిషేక సేవ జరుగుతుండగానే దర్శనానికి అనుమతించారు. అంతకుముందు వైకుంఠ ద్వార దర్శనాల సమయంలోనూ జనవరి 2న దాదాపు 3వేల మందికి అభిషేక సేవ దర్శనం కల్పించారు. ఎంతో డిమాండ్‌ ఉన్న అభిషేక సేవలో స్వామిని దర్శించుకుని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.

Updated Date - Jun 06 , 2026 | 05:10 AM