నీట్ పీజీకి పటిష్ఠ భద్రత: ఎస్పీ
ABN , Publish Date - Aug 29 , 2026 | 11:48 PM
జిల్లాలోని నాలుగు కేంద్రాల్లో ఆదివారం నిర్వహించే నీట్ పీజీ-2026 పరీక్షను ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అధికారులను ఆదేశించారు.
శ్రీకాకుళం క్రైం, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని నాలుగు కేంద్రాల్లో ఆదివారం నిర్వహించే నీట్ పీజీ-2026 పరీక్షను ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం శ్రీకాకుళంలోని జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా నీట్ పీజీ పరీక్షల భద్రత, పల్లెనిద్ర కార్య క్రమం, పెండింగ్ ప్రాపర్టీ కేసుల దర్యాప్తు తదితర అంశాలపై పోలీస్ అధికారులతో సమీక్షించారు. గతంలో కేటాయించిన ఎచ్చెర్ల మండలంలోని చిలకపాలెం జంక్షన్‌లోని శ్రీశివానీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, శ్రీవెంకటేశ్వరకాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలనీ, నరసన్నపేట మారుతీనగర్-2లోని కోర్ టెక్నాలజీస్ మూడు పరీక్ష కేంద్రాలతో పాటు కొత్తగా టెక్కలిలోని ఆదిత్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ పరీక్ష కేం ద్రంగా చేర్చినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుచేయడంతోపాటు జిరాక్స్, ఇంటర్నెట్ కేంద్రాలను మూసివేయాలని కోరారు. కేంద్రాల వద్ద సీసీ కెమెరాల పనితీరును పరిశీలించి అవసరమైన ప్రాంతాల్లో డ్రోన్ సర్వేలైన్స్ ద్వారా నిఘా ఏర్పాటు చేయాలన్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది పల్లెనిద్ర కార్య క్రమంలో భాగంగా ప్రతి గ్రామాన్ని సందర్శించాలని కోరారు. దర్యాప్తులో పెండింగ్‌లో ఉన్న ఉన్న ప్రాపర్టీ కేసులను వేగవంతంగా పరిష్కరించాలని ఎస్పీ ఆదేశించారు.