Share News

బాబోయ్‌..పులి!

ABN , Publish Date - Apr 02 , 2026 | 04:26 AM

పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలోని శరభవరం, నేలకోట గ్రా మాల మధ్యలో ఉన్న శ్రీరామదుర్గం కొండ సమీపంలో పెద్దపులి సంచరిస్తోందన్న....

బాబోయ్‌..పులి!

  • శ్రీరామదుర్గం కొండ సమీపంలో సంచారం

  • ఆ సమయంలో రామాలయంలో 50 మంది భక్తులు

  • సురక్షితంగా తరలించిన అటవీ శాఖ సిబ్బంది

దేవీపట్నం, ఏప్రిల్‌ 1(ఆంధ్రజ్యోతి): పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలోని శరభవరం, నేలకోట గ్రా మాల మధ్యలో ఉన్న శ్రీరామదుర్గం కొండ సమీపంలో పెద్దపులి సంచరిస్తోందన్న సమాచారం గురువారం ఉదయం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో హల్‌చల్‌ చేసింది. ఆ సమయంలో కొండపై రామాలయంలో 50 మందికి పైగా భక్తులు భజనలు, పూజల్లో పాల్గొన్నారు. ఈ సమాచారం స్థానిక నేతల ద్వారా తెలిసిన వెంటనే రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరి కార్యాలయం నుంచి పోలవరం జిల్లా కలెక్టర్‌, డీఎ్‌ఫవోలను అప్రమత్తం చేశారు. కొండపై ఉన్నవారిని సురక్షితంగా కిందకు తీసుకువచ్చేందుకు అటవీ శాఖ అధికారులు కొండపైకి వెళ్లారు. మధ్యాహ్నం 3గంటలకల్లా ఎవరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ట్రాక్టర్లపై వారిని సురక్షితంగా తీసుకురావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తమను సురక్షితంగా కిందకు తీసుకువచ్చిన అటవీశాఖ సిబ్బందిని భక్తులు అభినందించారు.

Updated Date - Apr 02 , 2026 | 04:26 AM