Share News

మళ్లీ పులొచ్చింది!

ABN , Publish Date - Feb 24 , 2026 | 04:06 AM

ఉమ్మడి ‘తూర్పు’లో మళ్లీ పులి భయం మొదలైంది. పోలవరం జిల్లా రంపచోడవరం మండలంలోని పెదగెద్దాడ అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్టు అటవీ శాఖ అధికారులు గుర్తించారు.

మళ్లీ పులొచ్చింది!

  • రంపచోడవరం అటవీ ప్రాంతంలో సంచారం

  • ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు అధికారుల హెచ్చరిక

రంపచోడవరం, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ‘తూర్పు’లో మళ్లీ పులి భయం మొదలైంది. పోలవరం జిల్లా రంపచోడవరం మండలంలోని పెదగెద్దాడ అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్టు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఇటీవల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని దివాన్‌చెరువు, కేశవరం, రాయవరం తదితర ప్రాంతాల్లో పెద్దపులి సంచరించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. అటవీశాఖాధికారులు ఆ పులిని విశాఖపట్నంలోని జూకు తరలించారు. అక్కడ చికిత్స అందించి ఆ తర్వాత పాపికొండలు అభయారణ్యంలో వదిలిపెట్టారు. కాగా, ఆది, సోమవారాల్లో మళ్లీ ఇదే పులి సంచారం రంపచోడవరం, మారేడుమిల్లి మండలాల్లోని అ టవీ ప్రాంతాల్లో కనిపించింది. ఈ నేపథ్యంలో రంపచో డవరం మండలం పెదగెద్దాడ సహా కాకవాడ, దారగూడెం, సీమగండి, అనెంపల్లి, మారేడుమిల్లి మండలంలోని రామన్నవలస, తుర్రూరు, దేవరపల్లి, సున్నంపాడు తదితర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖాధికారులు సూచించారు.

Updated Date - Feb 24 , 2026 | 04:07 AM