Share News

ఆవు దూడను చంపిన పెద్దపులి

ABN , Publish Date - Apr 19 , 2026 | 04:23 AM

ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు వద్ద పెద్దపులి సంచారం కార్మికులను, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తోం ది. స్పిల్‌వే దిగువన గోదావరి ప్రవాహ ప్రాంతంలో...

ఆవు దూడను చంపిన పెద్దపులి

  • భయాందోళనలో పోలవరం ప్రాజెక్టు కార్మికులు

పోలవరం, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు వద్ద పెద్దపులి సంచారం కార్మికులను, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తోం ది. స్పిల్‌వే దిగువన గోదావరి ప్రవాహ ప్రాంతంలో శుక్రవారం రాత్రి పెద్దపులి ఓ ఆవుదూడను చంపింది. పులి మెడకు అమర్చిన రేడియో ఫ్రీక్వెన్సీ ట్రాకర్‌ ద్వారా అది సంచరించిన ప్రాంతాల్ని పరిశీలించిన అటవీ సిబ్బంది ఆవుదూడ కళేబరాన్ని గుర్తించారు. అక్కడ నుంచి పులి సంచరించిన ఎనిమిది ప్రాంతాల్లో ట్రాప్‌ కెమెరాలు అమర్చారు. పులి సంచరించిన ప్రాంతాల్లో ట్రాప్‌ కెమెరాలు అమర్చామని, దానిని బంధించేందుకు రెస్క్యూ టీంలను సిద్ధం చేసినట్టు అటవీ క్షేత్రాధికారి ఎస్‌కె.వలీ చెప్పారు. పులి సంచరిస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టు భద్రతా బలగాలు పర్యాటకుల రాకపోకలను నిషేధించారు. కార్మికులు అప్రమత్తంగా ఉండాలని, ప్రాజెక్టు ప్రాంతంలో పశువుల్ని మేపుకునేవారు వాటిని మైదాన ప్రాంతాలకు తరలించాలని హెచ్చరించారు.

Updated Date - Apr 19 , 2026 | 04:24 AM