చిక్కినట్టే చిక్కి.. తప్పించుకున్న పులి
ABN , Publish Date - Jan 27 , 2026 | 05:12 AM
ఏలూరు జిల్లా ఏజెన్సీవాసులను ఇంకా పులి భయం వీడలేదు. ఆదివారం కొయ్యలగూడెం మండలం డిప్పకాయలపాడులోని ఒక రైతుకు చెందిన మొక్కజొన్న...
కొయ్యలగూడెం, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): ఏలూరు జిల్లా ఏజెన్సీవాసులను ఇంకా పులి భయం వీడలేదు. ఆదివారం కొయ్యలగూడెం మండలం డిప్పకాయలపాడులోని ఒక రైతుకు చెందిన మొక్కజొన్న తోటలో పులి తిష్ఠ వేసిన విషయం విదితమే. దాని కదలికలను పరిశీలించేందుకు అటవీ అధికారులు తోట చుట్టూ ట్రాప్ కెమెరాలను అమర్చారు. దాన్ని బంధించేందుకు నలువైపులా బోన్లు సిద్ధం చేశారు. దీంతో పులి దాదాపు చిక్కినట్టేనని అంతా భావించారు. అయితే సోమవారం సాయంత్రం వరకు మొక్కజొన్న తోటలోనే ఉన్న పులి ఆపై బిల్లిమిల్లి, మర్రిగూడెం గ్రామాల వైపునకు వెళ్లినట్టు అడుగు జాడలను బట్టి సోమవారం ఉదయం గుర్తించారు. ఆ ప్రాంతంలోని రైతులంతా తమ పశువులను ఇళ్లకు తరలించడంతో.. సోమవారం రాత్రి వరకు పులి నుంచి ఎక్కడా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. డ్రోన్ కెమెరాలతో దాని ఆచూకీ కనిపెట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.